రేప్ పార్టీలో ఒక్క ధనవంతుడి బిడ్డపైనా కేసు నమోదు కాలేదు : అసదుద్దీన్ ఓవైసీ
పోలీసులను దూషించిన కేసులో ఎంఐఎం కార్పొరేటర్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసులను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై హైదారాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చట్టం ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు కావాలన్నారు.
హైదారాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ పట్టుబడిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలందరినీ వదిలివేశారు. ఏ ఒక్కరిపై కేసు నమోదు కాలేదని గుర్తుచేశారు.
రేవ్ పార్టీలో కొకైన్ దొరికిందన్నారు. ఇక్కడ పట్టుబడిన ధనవంతుల పిల్లలందరూ విడుదలయ్యారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని గుర్తుచేశారు.
"ఆర్టికల్ 13 ప్రకారం రూల్ ఆఫ్ లా అత్యున్నతమైనది. అందరికీ సమానమైనది. ఈ "రేవ్ పార్టీ"లో కొకైన్ కనుగొనబడటం చాలా దురదృష్టకరం. పైగా ధనవంతుల పిల్లలందరినీ విడుదల చేయడం చాలా మరీ దురదృష్టకరం అంటూ ట్వీట్ చేశారు.
రూల్ ఆఫ్ లా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు చేయాలంటూ హైదరాదాద్ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.