1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Minister ktr tour in America

అమెరికాకు కేటీఆర్.. ఎందుకో తెలుసా?

Minister
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు మరియు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ ప్రతినిధుల బృందం అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు. 
 
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటన వుంటుంది. వారం రోజులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు.
 
తర్వాతి కథనం
కడపలో బీజేపీ ‘రాయలసీమ రణభేరి’ సభ