సంబంధిత వార్తలు
- వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై అట్రాసిటీ కేసు
- జగన్ బతికుండగా.. సీఎం సీట్‌ను టచ్ చేసేవాడు లేడు: కొడాలి నాని
- ఎందరు 'భీమ్లా నాయక్'లు వచ్చినా నన్నేమీ చేయలేరు.. ద్వారంపూడి
- వైకాపా అనే మహిషానికి కొమ్ములు విరగ్గొడతాం - మాటల తూటాలు పేల్చిన పవన్ కళ్యాణ్
- ద్వారంపూడికి "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా : పవన్ కళ్యాణ్
ఆ కంపెనీలన్నీ వైసీపీ మంత్రులవే.. సోమిరెడ్డి ఫైర్
ఏపీలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ మంత్రులు, ఎంపీలు, నేతలవేనని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
డబ్బులు దోచుకోవడం కోసొమే ముఖ్యమంత్రి జగన్ ఊరూపేరూ లేని కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.
కల్తీ సారాను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని విమర్శించారు. జనాలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని... తనకు రావాల్సిన సొమ్ము వస్తే చాలనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని దుయ్యబట్టారు. నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల ప్రతి ఏటా రూ. 5 వేల కోట్లను దండుకుంటున్నారని ఆరోపించారు.
జంగారెడ్డిగూడెంలో 28 మంది ప్రాణాలు కోల్పోక ముందే అక్కడున్న నాటుసారా నిల్వలను నాశనం చేసి ఉండాల్సిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.
తర్వాతి కథనం
