ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (15:47 IST)

ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. బైకుపై ఎక్కించుకుని?

ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. విద్యార్థినిని బైక్‎పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలుపగా... వెంటనే వారు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.