గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (15:38 IST)

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌: మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్

ఏప్రిల్‌ 21న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో  ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌ను సవరిస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 
 
తాజాగా సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఫస్ట్‌ ఇయర్, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఇక ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.