గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:56 IST)

కేసీఆర్‌కు బర్త్ డే విషెష్.. పనిలో పనిగా బండి సంజయ్ ఏమన్నారంటే?

తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు జన్మదినోత్స శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. 
 
అలాగే పనిలో పనిగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని జోస్యం చెప్పారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి దేశ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నరని విమర్శలు కూడా గుప్పించారు. 
 
వార్తల్లో నిలిచేందుకు, చర్చల్లో ఉండటానికి సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారని, రాజ్యాంగం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే సర్జికల్ స్ట్రైక్స్ లాంటి అంశాలతో ప్రజల దృష్టి మరలిస్తున్నారని సంజయ్ విమర్శించారు.
 
జన్మదినం సందర్భంగా కేసీఆర్ మంచి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
10 జన్ పథ్ స్క్రిప్ట్ కు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఆకాంక్షలకు భిన్నంగా ఒకే కుటుంబం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని విమర్శించారు.