శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (12:54 IST)

మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తాం.. బండి సంజయ్ కౌంటర్

జనగామ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బీజేపీ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఖబడ్దార్ నరేంద్ర మోదీ.. బీజేపీ బిడ్డల్లారా తెలంగాణ జోలికికొచ్చినా.. తెలంగాణ బిడ్డల జోలికొస్తే మిమ్మల్ని "నశం చేస్తాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతల బండి సంజయ్ అంతకంటే ఘాటుగా కేసీఆర్‌కు కౌంటరిచ్చారు. 
 
కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కచ్చితంగా కేసీఆర్ పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు. మిమ్మల్ని నశం పెట్టి నలిపేస్తాం అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి బండి సంజయ్ మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తాం అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. 
 
జనగామ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ అదే సమయంలో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్‌ ఇచ్చారు.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. 
 
బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత? మేం ఊదితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు సీఎం కేసీఆర్‌.