1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:20 IST)

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గృహనిర్భంధం

తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తెరాస చేపట్టిన నిరసనల్లో పలుప్రాంతాల్లో గొడవలు జరిగాయి. 
 
మోడీకి వ్యతిరేకంగా తెరాస, తెరాసకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మౌనదీక్షలకు పిలుపునిచ్చింది. అలాగే, తెరాస శ్రేణులు చేసిన దాడుల్లో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని పరామర్శించేందుకు ఈటల రాజేందర్ జనగామ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈటల రాజేందర్‌ను గృహనిర్భంధంలో ఉంచారు. దీంతో పోలీసులపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని గుర్తుచేశారు. నిరసనలు, బంద్‌లకు ఒక్క తెరాస పార్టీకే మాత్రమే అనుమతిస్తారా అని ప్రశ్నించారు.