మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (09:02 IST)

జనగామ - యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన ఈ రెండు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన సమయంలో ఆయా జిల్లాల్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవాలకు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. 
 
జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అనేక కొత్త జిల్లాలకు సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. 
 
ఇపుడు ఈ రెండు జిల్లాలకు నిర్మించిన కొత్త భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్ర నిర్మాణంలో భాగంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్‌ను ఆయన ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ రెండు జిల్లాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.