బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (10:16 IST)

కోడికి టిక్కెట్ కొట్టిన కండక్టర్ పైన చర్యలు తీసుకుంటాం, కోడితో పాటు ప్రయాణికుడిని దింపేయాలి

తెలంగాణ ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు కండెక్టర్ బస్సులో ఎక్కిన ప్రయాణికులతో పాటు ఓ ప్రయాణికుడు తన వెంట తెచ్చుకున్న కోడిపుంజుకు కూడా ప్రయాణ టిక్కెట్ కొట్టాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆ కండక్టర్‌తో పాటు టీఎస్ఆర్టీసీపై జోకులు పేల్చుతున్నారు. 

 
ఈ వ్యవహారంపై గోదావరిఖని డిపో మేనేజర్ మాట్లాడుతూ, బస్సుల్లోకి జంతువులను అనుమతించడం కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. కోడితో పాటు వాహనం ఎక్కిన ప్రయాణీకుడిని కండక్టర్ గమనించలేకపోవడంతో పాటు తన విధులను విస్మరించాడు. అతను కోడిని గమనించగానే ప్రయాణీకుడిని బస్సు నుండి దించవలసి వుంటుంది. అలా కాకుండా కండక్టర్ ఆ కోడికి టిక్కెట్టు ఇచ్చి మరో తప్పు చేశాడు. కాబట్టి కండక్టర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు.