మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (10:50 IST)

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు : తొలి దశలో 60.17 శాతం పోలింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 60.17 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 
 
అయితే, ఘజియాబాద్‌లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, తొలి దశ పోలింగ్‌లో మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 73 మంది మహిళలు ఉండటం గమనార్హం.