1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 2021 Sees Highest Death Row Population Since 2004

2021లో దేశ వ్యాప్తంగా 144 మందికి ఉరిశిక్షలు

India
దేశ వ్యాప్తంగా గత యేడాది వివిధ రాష్ట్రాల్లో 144 మందికి ముద్దాయిలకు కోర్టులు మరణశిక్షలను విధించాయి. అయితే, అప్పటికే ఈ శిక్షలు పడి, అమలు పెండింగ్‌లో ఉన్న వాటిని కలిపి చూస్తే 2021లో మొత్తం 488 మంది ప్రస్తుతం మరణశిక్షలను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను ఢిల్లీ న్యాయ విశ్వవిద్యాలయం చేసింది. 
 
ఈ వర్శిటీ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని సెషన్స్ కోర్టులు గత యేడాది 34 మంది మరణశిక్షలను ఖరారు చేశాయి. ఇదే ఇతర రాష్ట్రాల కోర్టులు విధించిన కోర్టులతో పోల్చితే అధికం. దీంతో ఈ రాష్ట్రంలో మరణశిక్షలను అమలు చేయాల్సిన వారి సంఖ్య 86కు చేరింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మందికి, తెలంగాణాలో ఒక ముద్దాయికి శిక్ష విధించాయి. సుప్రీంకోర్టు మాత్రం గతయేడాది ఒక్క కేసులోనూ ఈ శిక్షను ఖరారు చేయలేదు.
 
ప్రస్తుతం దేశంలో మరణశిక్షలను ఎదుర్కొంటున్న వారిలో 2016లో 400గా వుంటే, 2017లో 366, 2018లో 426, 2019లో 378, 2020లో 404, 2021లో 488 మందికి పెరిగింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీలో ఫిబ్రవరి 14వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ