సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (08:59 IST)

ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇవ్వలేదు : హీరో సుమన్

ఇండియన ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని హీరో సుమన్ స్పష్టం చేశారు. పైగా, ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను భూమిని ఇంకా విరాళంగా ఇవ్వలేదని చెప్పారు. 

 
ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అందువల్ల సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. 

 
కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుమన్ పేరు హోరెత్తిపోతుంది. ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని దానం ఇచ్చి, గొప్ప మనసును చాటుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.