శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (16:43 IST)

వ్యాయామం, విహార‌యాత్ర‌లతో ఎంజాయ్ చేస్తున్న స‌మంత‌

Samantha
స‌మంత, నాగ‌చైత‌న్య‌తో వైవాహిక జీవితం తెగ‌తెంపులు అయ్యాక చాలా ఫ్రీ బ‌ర్డ్ అయిందనేది తెలిసింది. త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ఎంజాయ్ చేస్తోంది. త‌న స్నేహితురాళ్ళ‌తో క‌లిసి బీచ్‌లు కొండ ప్రాంతాలు ప‌ర్య‌టిస్తూ నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రిస్తోంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో స‌ఖి గాళ్ అనే బ్రాండ్‌న పిల్ల‌ల కోసం త‌యారుచేసి మార్కెట్ లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పుడు మ‌ర‌లా వెంట‌నే స్విట్జ‌ర్లాండ్ వెళ్లిన‌ట్లు పిక్‌లు పెట్ట‌గానే ఆమె ఫాలోవ‌ర్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు.
 
Samantha
లైట్ బ్లూ జీన్స్ ధ‌రించి బ్లాక్ క‌ల‌ర్ టాప్ ష‌ర్ట్ ధ‌రించిన ఆమె సుంద‌ర‌మైన ప్రాంతాన్ని య‌దేకంగా చూస్తున్న ఫొటోకు ఎవ‌రికోస‌మో అంటూ కొంటెగాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఉద‌య‌మే జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతూ, ఆ త‌ర్వాత ఒయ‌టి ప్రాంతాలను చూస్తూ వున్న ఫొటోలు పెట్టి అభిమానుల‌ను అల‌రిస్తోంది. 
 
ఇటీవ‌లే స్నో స్పోర్గ్స్ ఆడుతూ పెట్టిన ఫొటో కూ అంతే ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా స్విస్‌లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. స‌మంత తాజాగా తెలుగు, త‌మిళంతోపాటు ఓ వెబ్ సిరీస్‌ను చేయ‌నుంది. ఇప్ప‌టికే శాకుంత‌లం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. క‌రోనా వ‌ల్ల సినిమా అనుకున్న టైంకు విడుద‌ల కాలేక‌పోతోంది.