శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (22:46 IST)

గర్భందాల్చనున్న సమంత? (video)

టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత గర్భందాల్చనుంది. అదేంటి.. భర్త అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత గర్భందాల్చడమేంటి అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అయితే, సమంత నిజంగానే గర్భందాల్చనుంది. కానీ, నిజ జీవితంలో కాదు సుమా.. తాను నటిస్తున్న కొత్త చిత్రం యశోద సినిమాలో ఆమె గర్భవతి పాత్రను పోషించనున్నారట. 
 
లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌‍గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సమంత నర్సు పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం హైదరాబాద్ నగరంలో ఓ ఆస్పత్రి సెట్‌ను కూడా నిర్మించారు. ఇందులోనే చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. 
 


 
ఈ నేపథ్యంలో సమంత ప్రెగ్నెట్ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నర్తించిన సమంత తన క్రేజ్‌ను అమాంతంగా పెంచుకున్న విషయం తెల్సిందే.