బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (21:56 IST)

చైతూ-శామ్ విడాకులపై అక్కినేని నాగార్జున ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. చైతూ, సామ్ విడిపోవడంపై తాను చాలా వర్రీ అయినట్లు, ఈ పరిస్థితినుంచి చైతన్య ఎలా గట్టెక్కుతాడో అని ఆందోళన చెందానని వెల్లడించారు. ఈ అంశంపై ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందించారు.
 
కానీ చైతన్యకు పరిస్థితులను తట్టుకుని నిలబడే ధైర్యముందని తెలిపాడు. తానే తనకు ధైర్యం చెప్పాడని నాగార్జున వెల్లడించాడు. చైతన్య ఇంత మానసిక పరిపక్వతతో వ్యవహరించడం తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగించిందన్నారు. 
 
చైతూ-సామ్ విడాకులు తీసుకోడం బాధాకరమని, ఏ వ్యక్తి అయినా ఇలాంటి పరిస్థితిని తట్టుకుని నిలబడటం కష్టమని కానీ నాగచైతన్య చాలా కూల్‌గా హుందాగా ప్రవర్తించాడని అన్నారు.