Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)
పూణేలోని ఖేడ్-శివపూర్ ప్రాంతంలో ఓ అంకుల్ ఆంటీ నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. పట్టపగలే రోడ్డుపై బైకులో హగ్గులు, ముద్దులతో డోస్ పెంచారు. వీరి సరసాలను రోడ్డు పైన వెళ్తున్న మిగితా వాహనదారులు తమ ఫోన్లలో బంధించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హీరోహీరోయిన్లుగా తమను భావించిన ఆ జంట సిగ్గు లేకుండా రోడ్డుపైనే రెచ్చిపోయారు. బైకును భర్త డ్రైవ్ చేస్తుండగా అ బైకు ట్యాంక్‌పై అపొజిట్‌లో కూర్చుని భర్తతో అతని భార్య రొమాన్స్ చేయడం మొదలుపెట్టింది.
ఎవరైనా చూస్తే ఏం అనుకుంటారు అనేదే మరిచిపోయారు. తమది ఈ లోకం కాదన్నట్లుగా ప్రవర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ జంటను తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.