డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు
మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన ఓ టెక్కీ.. డెలివరీ ఏజెంట్‌పై అసత్య ప్రచారం చేసింది. డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ వచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపగా అబద్ధం అని తేలింది.
ఈ నెల 3వ తేదీన 22 యేళ్ళ యవసున్న ఓ టెక్కీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన ఒక వ్యక్తి తన ఫ్లాట్‌లోకి చొరబడి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయేలా చేశాడని తెలిపింది.
సదరు వ్యక్తి తన ఫోటోలు తీశాడని, ఈ విషయం బయటకు చెబితే సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తానని బెదిరించాడని పోలీసులకు వివరించింది. తన ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలను కూడా సమర్పించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా, ఇదంతా అబద్ధమని తేలింది.
డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన వ్యక్తి ఆమె స్నేహితుడుగా గుర్తించారు. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని, కావాలనే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమెపైనే కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.