గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...
ఇటీవలికాలంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ముందుకు వెళ్లిన అనేక మంది దారితప్పిన సంఘటనలు పలు వెలుగులోకి వచ్చాయి. సగం నిర్మించిన వంతెనలపైకి వెళ్లి ప్రమాదాలకు గురికావడం, అడవుల్లోకి వెళ్లడం వంటి వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
కేరళకు చెంది జోసెఫ్ అనే వ్యక్తి భార్యతో కలిసి కారులో వెళుతూ గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అయ్యి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కేరళలో ప్రస్తుతం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం ప్రాంతంలోని కడుతురుత్తి రోడ్లు జలమయం అయ్యాయి.
కాగా, జోసెఫ్ ఆయన భార్య ఆ సమయంలో కారులో అటుగా వచ్చారు. గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తున్న విధంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వరద నీటిలో వెళ్లారు. కారు ముందు మభాగం వరద నీటిలో మునిగిపోగా, వారిని స్థానికులు రక్షించారు. ఆ తర్వాత కారును బయటకు తీశారు.