మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (14:28 IST)

సమంతతోనే బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ : నాగ చైతన్య

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నారు. ఇది సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలకు ఏమాత్రం నచ్చలేదు. కానీ, వారిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. 
 
అయితే, విడాకుల తర్వాత సమంత మాత్రం ఈ విషయంపై ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ, నాగ చైతన్య మాత్రం ఇటీవల బంగార్రాజు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించారు. విడాకులు అనేది మా ఇద్దరి బెస్ట్ డిసిషన్ అంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదిలావుంటే, నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. లాల్ సింగ్ చద్దా చిత్రంతో ఆయన బాలీవుడ్‌లో డెబ్యూ ఇస్తున్నారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‍ తాజాగా జరిగింది. ఇందులో నాగచైతన్య కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు మీ బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరు? అనే ప్రశ్నకు నాగ చైతన్య ఏమాత్రం తడుముకోకుండా సమంత పేరు చెప్పేశారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏ మాయ చేశావే సినిమా దగ్గర నుంచి వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. సామ్‌తో నేను చాలా కంఫర్టుబుల్‌గా ఫీలవుతాను అని చెప్పుకొచ్చారు.