బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (11:24 IST)

సల్మాన్ ఖాన్‌తో నాకు రిలేషనా? ఆయన అలాంటివాడు: సమంత

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (సల్లూభాయ్) మాంచి రసిక ప్రియుడు. ఈయన ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో డేటింగ్ చేశారు. ప్రేమలో పడ్డారు. అవి బ్రేకప్‌లు కూడా అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హాలీవుడ్ నటి సమంత లాక్‌వుడ్ చేరింది. 

 
ప్రస్తుతం ఈమెతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ హాలీవుడ్ తార గత కొన్ని రోజులుగా సల్లూ భాయ్ ఫాంహౌస్‌లో కనిపిస్తున్నారు. 

 
పైగా, కండలవీరుడు ఫ్యామిలీ కార్యక్రమాలకు కూడా తరచుగా హాజరవుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రహస్యంగా డేటింగ్ నడుస్తుందన్న పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసిన సమంత ఆగ్రహం వ్యకం చేసినట్టు సమాచారం. 

 
దీనిపై ఆమె స్పందిస్తూ, "ప్రజలు చాలానే మాట్లాడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నేను  సల్మాన్ ఖాన్‌ను కలిశాను. అతను చాలా మంచి వ్యక్తి. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. నేను సల్మాన్‌ని కలిసినట్టే హృతిక్ రోషన్‌ను కూడా కలిశాను. కానీ, అపుడు అలాంటి వార్తలు రాలేదు. ఇపుడు ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు అని వాపోయారు.