శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:58 IST)

నాకు ర‌త్నం దొరికింది - కంగనా_రానౌత్

Kangana Ranaut
బాలీవుడ్ న‌టి ఫైర్ బ్రాండ్ కంగనా_రానౌత్ గురించి తెలియందికాదు. ఉన్న‌ది ఉన్న‌ట్లు అనేసే ఆమెకు క్వీన్ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత త‌లైవి సినిమా ఆమెకు మ‌రో మెట్టు ఎదిగేలా చేసింది. ఆమెకు ఎప్ప‌టినుంచో ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నే కుతూహ‌లం వుంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది. ఇదిలా వుండ‌గా ఇటీవ‌లే ఓ ఆనందాన్ని త‌న అభిమానుల‌తో ఇలా పంచుకుంది.
 
నాకు ఇది మామూలు రోజు కాదు, ఈరోజు `టికు వెడ్స్ షేరు` సెట్స్‌లో నాకు అరుదైన రత్నం దొరికింది, 1950ల భారతీయ సినిమా స్వర్ణయుగం నాటి నేవాల్ కెమెరాతో ప‌నిచేస్తున్నా.గొప్ప దర్శకుల్లో ఒకరైన శ్రీ బిమల్ రాయ్ జీకి చెందింది. అంటూ ఆ కెమెరాపై ను ప‌ట్టుకుని ఇలా ఫోజ్ లిచ్చింది. నేను నా రెండవ చలన చిత్రం ఎమర్జెన్సీకి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను.  కాబట్టి ఇలాంటి కెమెరా నాకు ల‌భించ‌డం ఆశీర్వాదంగా భావిస్తున్నా. చిత్రీకరణ కోసం ఈ విలువైన రత్నాన్ని అందించిన బిమల్ రాయ్ జీ కుటుంబానికి ధన్యవాదాలు. దీన్ని ఏర్పాటు చేసినందుకుడోన్ ఫెర్నాడోజ్‌కు ప్ర‌త్యేక ధన్యవాదాలు తెలిపింది.