శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (19:02 IST)

కంగ‌నాపై విమ‌ర్శ‌లు - మ‌రోవైపు బాస్ లేడీ అంటూ ప్ర‌శంస‌లు

kanganaranuat
కంగనా రనౌత్ విష‌యంలో ఒక‌వైపు విమ‌ర్శ‌లు మ‌రోవైపు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇటీవ‌లే ఆమెకు ప‌ద్మ‌శ్రీ అవార్డు కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసింది. అంత‌కుముందు ఆమె ఢిల్లీ రౌతుల‌పై, నోట్ల ర‌ద్దుపై, కాశ్మీర్ ఇష్యూపై చేసిన కామెంట్లు వివాదాస్ప‌దంగా మారాయి. ఆమెను కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కులు ఇబ్బందికి గురిచేసిన సంఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఎట్ట‌కేల‌కు మ‌ణిక‌ర్ణిక‌, త‌లైవి సినిమాల‌లో ఆమె చూపిన న‌ట‌నాప్ర‌తిభ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం ఫిదా అయిపోయింది. 
 
అయితే ఈ సంద‌ర్భంగా ఆమె దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వ‌చ్చింది అనే దానిపై సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ జ‌రుగుతోంది. ఓ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు.. అది బ్రిటిష్ వాళ్లు వేసిన భిక్ష అంది. దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్ప‌టికే సిపిఐ నాయ‌కుడు నారాయ‌ణ ఆమెపై క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ధ్వ‌జ‌మెత్తారు.
 
ఇలా ప‌లువురు ప‌లుర‌కాలుగా మండిప‌డుతుండ‌గా, ప్రైమ్ మినిస్ట‌ర్ న‌రేంద్ర‌మోడీ ఫ్యాన్ క్ల‌బ్ అనే సోస‌ల్ మీడియా లో కంగ‌నాను పొగిడేస్తూ ట్వీట్ చేశారు.  బాస్ లేడీ. కంగన  పర్యావరణ వ్యవస్థను కాపాడేలా చ‌ర్య‌లు చేస్తుంది. ఆమె చేస్తున్న సేవ‌లు గర్వంగా ఉంది క్వీన్. అంటూ పోస్ట్ చేసింది. ఇది ఒక‌ర‌కంగా ఓ ఎత్తుగ‌డ‌నా అనే సందేహం కూడా క‌లుగుతోంది. ఏది ఏమైనా కంగ‌నా హాట్‌టాపిక్‌గా మ‌రోమారు మారింది.