గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (12:36 IST)

బీజేపీ భీష్ముడు బర్త్‌డే వేడుకలు : పాల్గొన్న వెంకయ్య - నరేంద్ర మోడీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ తన 94వ పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని అద్వానీ నివాసానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా అద్వానీతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు. అద్వానీకి సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ప్ర‌ధాని మోడీ ప్రార్థించారు. సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో, ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలో ఈ దేశం అద్వానీకి రుణ‌ప‌డి ఉన్న‌ట్లు మోడీ త‌న ట్వీట్‌లో తెలిపారు. 
 
నవంబరు 8వ తేదీ సోమవారం పుట్టిన‌రోజు వేడుక సంద‌ర్భంగా.. అద్వానీ ఇంటి లాన్‌లో ఆయ‌నతో క‌లిసి ప్ర‌ధాని మోడీ న‌డిచారు. అద్వానీ ఓ స్ఫూర్తిదాయ‌క‌మైన‌, గౌర‌వప్ర‌ద‌మైన నేత అని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.