గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (18:18 IST)

ఉప రాష్ట్రపతి వెంక‌య్య‌కు ఘనంగా వీడ్కోలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయిదు రోజుల ప‌ర్య‌ట‌న ముగించుకుని భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి పాట్నాకు బ‌య‌లుదేరారు. రాష్ట్రంలో ఇటు కృష్ణా జిల్లాలో, అటు విశాఖలో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని రాష్ట్రానికి వీడ్కోలు ప‌లికారు.
 
విశాఖ జిల్లాలో 5 రోజుల పర్యటన అనంతరం గౌరవ భారత ఉపరాష్ట్ర పతి ఎం.వెంకయ్య నాయుడు శనివారం  సాయంత్రం 4.30 గం. లకు ప్రత్యేక విమానంలో పాట్నా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతికి, విమానాశ్రయంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రియర్ అడ్మిరల్ సందీప్ ప్రధాన్,   జిల్లా కలక్టరు డా.ఎ.మల్లిఖార్జున,  కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ సిన్హా, డి.ఐ.జి.  ఎల్.కె.వి. రంగారావు,  ఎస్. పి.  బి.కృష్ణారావు, ఎమ్ ఎల్ ఎ,  పి. జి. వి.ఆర్ నాయుడు  నేవీ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.