ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (13:04 IST)

లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత - స్విట్జర్లాండ్‌లో విహారం

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా, తన భర్త అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె మరింత స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తనకు ఖాళీ దొరికితేచాలు విహార యాత్రలకు చెక్కేస్తున్నారు. 
 
ఇటీవలే మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సమంత.. ఇపుడు స్విట్జర్లాండ్‌కు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ మంచు పర్వతాల్లో విహరిస్తూ ఫోటోలు దిగి వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం షేర్ చేసిన ఫోటోలో జీన్స్‌తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించి, పోనీటైల్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. తన హాలిడే డెస్టినేషన్‌లోని సుందరమైన ప్రదేశాన్ని చూస్తూ సామ్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.