శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (19:52 IST)

కేప్‌టౌన్ వన్డే మ్యాచ్ : భారత్ ముంగిటి భారీ టార్గెట్

కేప్‌టౌన్ వన్డేలో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ముంగిట సౌతాఫ్రికా భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీలో 49.5 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 
 
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతంగా ఆడి సెంచరీ బాదాడు. మొత్తంమ 130 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. అలాగే, మిడిల్ ఆర్డర్‌లో రాస్సీ వాన్ డర్ డసెన్ 52, మిల్లర్ 39, డ్వేస్ 20 చొప్పున పరుగులు చేశారు. 
 
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చహర్ 2, జస్ప్రీత్ 2, చహల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించి వికెట్ నష్టానికి 16.2 ఓవర్లలో 82 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్. రాహుల్ కేవలం 9 పరుగులు చేసి మరోమారు నిరాశపరిచారు. ప్రస్తుతం శిఖర్ ధవాన్, విరాట్ కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు.