1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Indian army recruitment 2022

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

Indian army recruitment 2022
ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 2022 సంవత్సరానికి గానూ 47వ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయి. 
 
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 23 దరఖాస్తులకు చివరితేది.  
పోస్టు వివరాలు: ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
మొత్తం ఖాళీల సంఖ్య: 90
 
వయోపరిమితి: అభ్యర్ధులు జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 
 
ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలు ప్రారంభం: ఏప్రిల్ 2022
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రివర్స్ పిఆర్సి జీవోలను రద్దు చేయాలి... బెజ‌వాడ‌లో భారీ ర్యాలీ