మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (14:00 IST)

ఈసీఐఎల్‌లో 150 ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) వివిధ విభాగాల్లో 150 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు- 145, డిప్లొమా అప్రెంటిస్‌లు- 05 ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 18 దరఖాస్తులకు చివరితేది.
 
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు -145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05.
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: జనవరి 18, 2022