గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (13:34 IST)

దేశంలోని టాప్-10 విద్యాసంస్థలివే.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటి కూడా...

దేశంలోని అగ్రగామి విద్యా సంస్థల జాబితాను అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్స్ తాజాగా వెల్లడించింది. ఈ నివేదికలో ఐఐటీ-మద్రాస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీలు ఉన్నాయి. 
 
ఆవిష్కరణలు, కొత్తగా కంపెనీలను స్థాపించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ఈ ఐఐటీ విద్యా సంస్థలు ముందువరుసలో ఉన్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర విద్యా శాఖ అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్స్‌ను తీసుకొచ్చింది. 
 
విద్యార్థులు, అధ్యాపకుల నుంచి ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ఏర్పాటు, వ్యవస్థాపక సామర్థ్యం, పేటెంట్ల దాఖలు తదితర అంశాలను ఆధారంగా ప్రతి యేటా ఈ ర్యాంకులను కేటాయిస్తుంది. ఈ ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క విద్యా సంస్థ పేరు కూడా లేదు. అలాగే, బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీ హైదరాబాద్‌లు ఐదు, ఆరు ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి. 
 
ఐఐటీ ఖరగ్‌పూర్, కాలికట్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూఫ్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వరుసగా ర్యాంకులు సొంతం చేసుకున్నాయి.