ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (16:57 IST)

ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. 
 
వీరిలో ఏడుగురు కువైట్, సౌదీ అరేబియా, అమెరికా, నైజీరియా నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారిని కలిసిన మరో ముగ్గురికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.
 
బాధితులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి పెరిగింది.