1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra pradesh Rains

ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Andhra pradesh
మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. 
 
బంగాళాఖాతం మీదుగా కోస్తా పైకి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అది బీజేపీ సొల్లు స‌భ‌! సోమును ఎవ‌రికైనా చూపించండి!!