బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (11:26 IST)

సంక్షేమ పథకాల లబ్దికోసం మరోమారు దరఖాస్తుకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అవకాశం కల్పించారు. సంక్షేమ నిధులు పొందేందుకు వీలుగా దరఖాస్తు చేసుకునేందుకు మరో చాన్సిచ్చారు. 
 
మంగళవారం ఏపీ ప్రభుత్వం 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాల్లో నగదును జమచేసింది. ఇప్పటివరకు ఈ పథకాల ద్వారా 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేసింది. 
 
అయితే, మంగళవారం ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులైన వారు ఎవరైనా ఉంటే మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. 
 
ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు నగదును ప్రతియేటా జూన్, డిసెంబరు నెలల్లో అందచేస్తామని తెలిపారు. డిసెంబర్ నెల నుంచి మే వరకు అమలైన పథకాలు లబ్దిపొందని వారికి రెండో విడతలో అందిస్తామని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపిక కూడా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.