1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:39 IST)

పీఆర్సీపై నివేదికకు సీఎం జగన్ ఆదేశం

ప్రభుత్వం ఉద్యోగులు 11వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్)ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఉద్యమ బాటపట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్‌తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు. 
 
అయితే, ఈ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, 30 శాతం ఫిట్మెంట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. అదేసమయంలో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, సీఎం దర్శన భాగ్యం వారికి లభించడం లేదు. ఈ క్రమంలో సీఎం జగన్ మంగళవారం సీఎస్ సమీర్ శర్మతో పాటు కొందరు ముఖ్య కార్యదర్శులతో పీఆర్సీపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.