శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (17:42 IST)

జ‌గ‌న్‌గారు పాజిటివ్‌గా ఆలోచించండి - ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి

R. Narayanamurthy
క‌రోనా త‌ర్వాత థియ‌ట‌ర్ల ప‌రిస్థితి ఏమిటి? అనే అనుమానం వ‌చ్చింది. ఓటీటీ వైపు మ‌ళ్ళుతుందా! అని కూడా ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు అనిపించింది. అలాంటి టైంలో మ‌ర‌లా థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. ఇటీవ‌లే అఖండ సినిమాతో బాల‌కృష్ణ చ‌రిత్ర సృష్టించారు. ఆ త‌ర్వాత పుష్ప‌తో ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా తీస్తే చూస్తామ‌నే సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు నాని శ్యామ్ సింగరాయ్ కూడా ఆద‌రిస్తున్నారు. కానీ నేను ఇటీవ‌లే పేప‌ర్ల‌లో చ‌దివాను. ఆంధ్ర‌లో చాలా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి.
 
సినిమాకు మ‌ర‌లా గ‌డ్డుకాలం వ‌చ్చింది అనిపించింది. సూళ్లూరుపేట‌లో ఏషియ‌న్ సినిమా మూసేశారు. ఇలా చాలా చోట్ల మూత‌బ‌డ్డాయి. సినిమా ప‌రిశ్ర‌మ‌ను న‌మ్ముకుని కోట్ల‌మంది బ‌తుకుతున్నారు. అందుకే సినీ పెద్ద‌లు చిరంజీవి, అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, నాగార్జున‌తోపాటు ఫిలింఛాంబ‌ర్‌, మా అసోసియేష‌న్ పెద్ద‌లు క‌లిసి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించాలి. ఎగ్జ‌బిట‌ర్లు మీ ఎం.ఎల్‌.ఎ.లకు స‌మ‌స్య‌లు చెప్పి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేలా చూడండి. ప్ర‌పంచంలోనే తెలుగు సినిమా స్థాయి రేంజ్ పెరిగింది. అలాంటి టైంలో థియేట‌ర్లు మూసివేయ‌డం చాలా బాధ‌క‌రం. సంక్రాంతి పండుగ‌కు ముందు ఇలా జ‌ర‌గ‌డం మంచిది కాదు. అయ్యా! జ‌గ‌న్‌గారు మా సినిమాను బ‌తికించండి. మీరు పాజ‌టివ్‌గా వుండాల‌ని వేడుకుంటున్నాన‌ని తెలిపారు.