శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:31 IST)

తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభణ: కొత్తగా 12 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. సోమవారం కొత్తగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరింది.
 
అలాగే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
అయితే.. ఇప్పటివరకు 151 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి.