1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Smartphone trends that will dominate New Year 2022

2022లో 5జీ టెక్నాలజీ: 4జీ స్పీడ్ కంటే 100 రెట్లు ఎక్కువ

Smartphone
2022లో 5జీ టెక్నాలజీ మానవ జీవనాన్ని మరింత స్మార్ట్‌గా మార్చనుంది. ఇప్పటికే కోవిడ్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందరికీ అనుభవంలోకి వచ్చింది. దీన్ని 5జీ టెక్నాలజీ మరింత కొత్త పుంతలు తొక్కించనుంది. 
 
పనుల సామర్థ్యాన్ని పెంచనుంది. రోజువారీ చాలా పనులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆటోమేట్ కానున్నాయి. దీంతో మరింత వినూత్నతతో పనిపై ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉద్యోగులకు రానుంది.
 
5జీలో డేటా వేగం 10-30 గిగాబైట్ల వరకు ఉంటుంది. 4జీ స్పీడ్ కంటే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల స్ట్రీమింగ్ అవాంతరాలు లేకుండా సాగిపోతుంది. గేమ్‌లు సహా అన్ని రకాల డౌన్ లోడ్‌లు సూపర్ స్పీడ్‌తో జరిగిపోతాయి. దీనివల్ల విలువైన సమయం ఎంతో ఆదా అవుతుంది.  
 
హెల్త్ కేర్ సేవలు కూడా మరింత వేగంగా మారిపోనున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును 5జీ మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఏఐ, మ్యాపింగ్ సాయంతో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ మరింత మెరుగ్గా నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు... కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్