1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (17:20 IST)

ఇంటర్ పాసైతే బాలికలకు స్మార్ట్ ఫోన్లు.. డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీలు

వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వరాలు గుప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విద్యార్ధినులు, యువతులకు గురువారం పలు వరాలు ప్రకటించారు. 
 
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చేసే యువతులకు స్కూటీలను ఉచితంగా అందచేస్తామని ఆమె వెల్లడించారు.
 
యూపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఆమోదం మేరకు తాను ఈ నిర్ణయం ప్రకటిస్తున్నానని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ వివరాలు వెల్లడిస్తూ ప్రియాంక గాంధీ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేశారు. 
 
కాలేజీ విద్యార్ధినులతో ముచ్చటిస్తున్న వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ప్రియాంక గాంధీ తమను కష్టపడి చదువుకోవాలని కోరారని, తమ భద్రత కోసం ఆమె స్మార్ట్‌ఫోన్లు అందిస్తామని చెప్పారని ఈ వీడియోలో ఓ యువతి చెబుతుండటం కనిపించింది.