శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (09:26 IST)

ప్రియాంకా గాంధీ అంటే రాహుల్‌కి భయం.. ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ అంటే రాహుల్‌కు భయం అని, ప్రియాంక గాంధీ శక్తి సామర్థ్యాలను చూపి రాహుల్ గాంధీ భయపడుతున్నారని, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించకపోవడం వెనుక ఇదే కారణం అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. 
 
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రియాంక గాంధీలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పోలికలు, బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.