ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 13 అక్టోబరు 2021 (16:59 IST)

స్పీడుమీదున్న కాంగ్రెస్... బ‌ద్వేల్ ఉప ఎన్నికకు 8 బృందాలు

బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడుగా ఉంది. త‌మ అభ్యర్థి కమలమ్మ విజయం కోసం 8 ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తెలిపారు. ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ఇంచార్జిలుగా, కో ఆర్డినేటర్లుగా వీరు వ్యవహరిస్తారని చెప్పారు. బుధవారం ఈ మేరకు  విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు.

టీం-1లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో బద్వేల్ మండలానికి నీలి శ్రీనివాస రావు, బి. ప్రతాప్ రెడ్డి, దాదా గాంధీ, బోగి రమణ, గొంపా గోవింద్, డోలా శ్రీనివాస్, సోదం నరసింహులు, మేడా సురేష్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.
 
ఇక టీం-2లో మస్తాన్ వలీ నేతృత్వంలో పోరుమామిళ్ల మండలానికి నజీర్ అహ్మద్ , అహ్మద్ అలీ ఖాన్ , జగన్ మోహన్ రెడ్డి , పి. రాకేష్ రెడ్డి , నాగ మధు యాదవ్, అమార్జా బేగ్ , బాబూ రావు కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

టీం-3లో డాక్టర్ చింతా మోహన్ నేతృత్వంలో కాశీనాయణ మండలానికి గుండ్లకుంట శ్రీరాములు, డాక్టర్ జి గంగాధర్, జి. ఏ నారాయణ రావు, బొద్దు శ్రీనివాస రావు, రాంభూపాల్ రెడ్డి, సరగడ రమేష్ , గుత్తుల శ్రీనివాస రావు కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

టీం-4లో  జే డీ శీలం  నేతృత్వంలో గోపవరం మండలానికి నీలి శ్రీనివాస రావు, శ్రీపతి ప్రకాష్, జమ్మూ అది నారాయణ, లక్ష్మీ నరసింహ యాదవ్, అలెగ్జాండర్ సుధాకర్, గంటా అంజిబాబు, భవానీ నాగేంద్ర ప్రసాద్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

టీం-5లో గిడుగు రుద్ర రాజు   నేతృత్వంలో అట్లూరు మండలానికి విష్ణు ప్రీతమ్ రెడ్డి, మధు రెడ్డి,  పి. శాంత  కుమారి, రుతల శ్రీరామ మూర్తి, బాలేపల్లి మురళీధర్, ఎన్.వీ శ్రీనివాస్, బోడ వెంకట్, ముల్లా మాధవ్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

టీం-6లో డాక్టర్ సిరివెళ్ల ప్రసాద్ నేతృత్వంలో బి. కోడూరు మండలానికి గుండ్లకుంట శ్రీరాములు, పి. హరి కుమార్ రాజు, చిలకా విజయ్, ఈద సుధాకర్ రెడ్డి, నరహరిశెట్టి నరసింహా రావు, వి. గురునాధం, పి .వై కిరణ్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

టీం-7లో జీ. వీ హర్షకుమార్  నేతృత్వంలో కలసపాడు మండలానికి బండి జక్రయ్య , సుబ్రమణ్య శర్మ , పతిపాటి లక్ష్మీ నారాయణ , సీహెచ్ మోహన రావు, బొర్రా కిరణ్ , రాజనాల రామ్మోహన్ రావు, వజ్జపతి శ్రీనివాస్, మన్నం రాజశేఖర్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

టీం-8లో ఎం. షాజహాన్ బాషా  నేతృత్వంలో బద్వేల్ మున్సిపాలిటీకి నజీర్ అహ్మద్ , ఎస్ ఏ సత్తార్, జెట్టి గురునాథ రావు, నాగలక్ష్మి, షేక్ సైదా , జగతా శ్రీనివాస్, మురళి కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు.