శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 18 జులై 2025 (18:07 IST)

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

Sayali Chowdhury
Sayali Chowdhury
బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా ‘సుమతీ శతకం’ అనే చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం అవుతోంది. ఈ మేరకు ‘సుమతీ శతకం’ ఫస్ట్ లుక్ విడుదలై అందరినీ మెప్పించింది. వింటేజ్ విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలా ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహించారు.
 
తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ను చూస్తుంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక త్వరలో టీజర్‌ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాల్ని పెంచాలని మేకర్లు భావిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఉంటాయని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని అన్నారు.
 
తారాగణం: అమర్‌దీప్ చౌదరి, సాయిలీ చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్.
మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్ , డీఓపీగా హాలేష్ పని చేస్తున్నారు.