గురువారం, 3 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (13:42 IST)

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Amar Deep Chowdhury, Saili Chowdhury and team
Amar Deep Chowdhury, Saili Chowdhury and team
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సుమతీ శతకం. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్లు ప్రకటించారు.
 
అలా నిన్ను చేరి, సన్నీ లియోన్ మందిర సినిమాలను నిర్మించి విజయాన్ని అందుకుంది విజన్ మూవీ మేకర్స్ మూడో సినిమాగా 'సుమతీ శతకం' రాబోతుంది. ఈ మూవీని కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తుండగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
 
ఈ సినిమాకి బండారు నాయుడు కథను అందించారు. ఈ మూవీకి సంగీతాన్ని సుభాష్ ఆనంద్ సమకూర్చుతున్నారు. ఈ సినిమాకి కెమెరా మెన్ హలేష్, ఎడిటర్ సురేష్ విన్నకోట.