1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 21 ఏప్రియల్ 2025 (18:15 IST)

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

Sumathi Satakam starts in Amaravati
Sumathi Satakam starts in Amaravati
సన్నీ లియోన్ నటించిన ‘మందిర’తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.  ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఈ యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్  అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక అతిథులతో పాటు చిత్ర తారాగణం, సిబ్బంది పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. 
 
సుమతీ శతకానికి కథను బండారు నాయుడు అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్నారు
తారాగణం: అమర్‌దీప్ చౌదరి, సాయిలీ చౌదరి, టేస్టీ తేజ తదితరులు