సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (13:11 IST)

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)

Sunny Leone
Sunny Leone
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ రెండో పెళ్లి చేసుకుంది. ఇదేంటి రెండో పెళ్లా.. ఇంతకీ ఎవరా వ్యక్తి. తొలి భర్తతో విడాకులా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయా అయితే కాస్త ఆగండి. ఒకప్పుడు శృంగార తార అయిన సన్నీ లియోన్.. ప్రస్తుతం ఆ ట్యాగ్‌కు పూర్తిగా దూరమై సినిమాలు చేసుకుంటుంది. 
Sunny Leone
Sunny Leone
 
అలాగే వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది. అయితే తన భర్తనే మళ్లీ పెళ్లాడింది కొత్త వ్యక్తిని కాదు. పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్‌.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు టూర్‌ వెళ్లింది. సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తను మరోసారి పెళ్లాడింది. 
Sunny Leone
Sunny Leone
 
తెల్లటి  దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాల్లో నటించింది. ఇంకా తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. 
Sunny Leone
Sunny Leone
 
కొన్ని చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నర్తించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన డేనియల్‌ వెబర్‌ని మళ్లీ పెళ్లాడిన ఫోటోలు చూడముచ్చటగా వున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిల్లల సమక్షంలో సన్నీ లియోన్ రెండో పెళ్లి పట్ల ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Sunny Leone