సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (18:09 IST)

భయపెట్టేలా సన్నీ లియోన్ - మందిర ఫస్ట్ లుక్

Sunny Leone    Mandira First Look
Sunny Leone Mandira First Look
ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం ‘మందిర’. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు వదిలారు. మందిర చిత్రానికి సంబంధించిన టైటిల్, సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సన్నీ లియోన్‌ను ఈ పోస్టర్‌లో గమనిస్తుంటే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.