శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (16:32 IST)

సౌరభ్ చంద్రశేఖర్ వివాహం.. రూ.200 కోట్ల ఖర్చు.. సన్నీ, టైగర్ ష్రాఫ్‌కు కష్టాలు

Sunny Leone
మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రశేఖర్ వివాహం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయిలో సౌరభ్ వివాహం జరిగింది. తన వివాహం కోసం సౌరభ్ రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ అధికారులు చెప్తున్నారు. 
 
పెళ్లికి అంత ఖర్చు ఎందుకని అడిగితే.. చంద్రశేఖర్ వివాహ ఖర్చులో అధిక భాగం హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీల చెల్లింపుల కోసమేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేస్తున్నట్టు తెలిసింది. 
 
టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్ తదితరులు వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు. చంద్రశేఖర్ తన వివాహం కోసం ముంబై నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు వెడ్డింగ్ ప్లానర్లు, డెకరేటర్లను రప్పించినట్టు తెలిసింది. 
 
సౌరభ్‌కు వ్యతిరేకంగా రూ.5,000 కోట్ల మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రశేఖర్ 2022లోనూ దుబాయిలో పెద్ద పార్టీ ఒకటి నిర్వహించాడు. ఆ సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు రూ.40 కోట్లు చెల్లించాడు.