సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:51 IST)

సినీనటి వరలక్ష్మికి ఎన్.ఐ.ఏ సమన్లు

varalakshmi
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేసింది. గతంలో వరలక్ష్మి వద్ద పీఏగా పని చేసిన ఆదిలింగం అనే మాజీ సైనికోద్యోగిని డ్రగ్స్ కేసులో ఎన్.ఐ.ఏ అరెస్టు చేసింది. అతడి వివరాల సేకరణ కోసం వరలక్ష్మికి ఎన్.ఐ.ఏ సమన్లు జారీచేసింది. 
 
పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 300 కేజీల హెరాయిన్, ఏకే 47 తుపాకీ, 1000 తుపాకీ తూటాల కేసులో ఆమె వ్యక్తిగత సహాయకుడు, మాజీ సైనికోద్యోగి ఆదిలింగం‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీచేసింది. 
 
కాగా, వరలక్ష్మికి తమిళ చిత్రపరిశ్రమలో కంటే తెలుగు చిత్రపరిశ్రమలోనే అత్యధికంగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఆమె తన మకాంను కూడా చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి మార్చారు. కోలీవుడ్ కంటే టాలీవుడ్ తనలోని ప్రతిభను గుర్తించి, అవకాశాలు ఇస్తుందంటూ వరలక్ష్మి పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు.