1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:37 IST)

ఆ హీరోయిన్... అత్తగారి కుటుంబం అంతా తాగుబోతులే...

Senior Actress Urvashi
Senior Actress Urvashi
నటి ఊర్వశి. ఒకపుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్. 2000 సంవత్సరంలో మలయాళ నటుడు మనోజ్ కె. జయన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. వివాహమైన తర్వాత ఆమెకు మద్యం అలవాటు అయింది. దీనికి కారణం ఆమె భర్త కూడా. అత్తగారి కుటుంబ సభ్యులంతా తాగుబోతులు కావడంతో ఊర్వశికి కూడా మద్యం అలవాటు చేశారు. ఆయన భర్త కూడా ప్రోత్సహించడంతో ఆమె మద్యానికి అలవాటు పడ్డారు. ఈ విషయాన్ని ఊర్వశి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాన్ని వివరించారు.
 
తన సినీ కెరీర్ మంచి జోరుగా మీదున్న సమయంలో తనకు మనోజ్ కె.జయన్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. మనోజ్ కె జయన్ కూడా నటుడే కావడంతో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అత్తవారింట అడుగుపెట్టిన తనకు ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికర వాతావరణం ఎదురైందని, అత్తగారింట్లో అందరూ మద్యం అలవాటున్నవారే. పైగా, కుటుంబం మొత్తం కూర్చుని మద్యం తాగేవారని చెప్పారు. 
 
పైగా, 'వాళ్లు నన్ను కూడా తాగమని ఒత్తిడి చేశారు. నా భర్త కూడా ప్రోత్సహించాడు. ఆ విధంగా నాకు మద్యం అలవాటైంది. చివరికి అది వ్యసనంలా తయారైంది. మద్యం సాకుతో మనోజ్ కె జయన్ నాకు విడాకులు ఇచ్చాడు. మద్యానికి బానిసైన నువ్వు బిడ్డను సరిగా పెంచలేవు అంటూ నా కూతుర్ని కూడా తీసుకెళ్లారు. దాంతో నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ఒంటరితనంతో కుమిలిపోయాను. ఆ దశలో శివప్రసాద్ అని మా కుటుంబానికి దగ్గరి వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. అప్పటికి నాకు 40 ఏళ్లు. ఇప్పుడు భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను' అని ఊర్వశి వివరించారు.