సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (13:28 IST)

భార్య మృతితో ఒంటరిగా మారిన టీచర్ ... మానసిక ఒత్తిడితో ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో చందానగర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్య మృతితో ఒంటరి అయిన ఒక ప్రొఫెసర్.. మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఒంటరిగా జీవించలేక తాను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణాలోని చందానగర్ పాత ఎంఐజీ కాలనీకి చెందిన తాళ్లూరి రాధా ఫణి ముఖర్జీ (47) అనే వ్యక్తి మేడ్చల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈయన భార్య ఒక యేడాది క్రితం చనిపోయింది. ఈ క్రమంలో గురువారం కాలేజీకి రావడం లేదని యాజమాన్యానికి ఫోను చేసి చెప్పాడు.
 
అదే రోజు సాయంత్రం ఇంట్లోనుంచి తలుపులువేసుకుని బయటకు రాలేదు. పైగా కళాశాల నుంచి, నగరంలో ఉంటున్న సోదరి, ఇద్దరు సోదరులు కూడా ఫోన్లు చేసినా లిఫ్టు చేయలేదు. దీంతో శుక్రవారం సోదరి, సోదరుడు వచ్చి తలుపులు తెరవగా ఫ్యానుకు తాడుతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. 
 
ఇంట్లో సూసైడ్ లేఖ లభించింది. తన కుమారుడు రేవంత్‌కు తన ఆస్తులు అందించాలని కోరాడు. తన మృతికి ఎవరూ కారకులు కాదని పేర్కొన్నాడు. భార్య మృతి కారణంగా ఒతితిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.