సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:03 IST)

పసిడి ప్రియులకు షాక్.. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

gold coins
పసిడి ప్రియులకు షాక్ తగులుతుంది. వరుసగా మూడో రోజు కూడా వీటి ధరలు పెరిగాయి. ఈ నెల 23వ తేదీన నుంచి వీటి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 
 
23వ తేదీన హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల ఒక బంగారం ధర రూ.5430గా ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ.43360గా ఉంది. అలాగే, 10 గ్రాముల బంగారం ధర రూ.54300గా ఉంది. గురువారంతో పోల్చితే ఈ బంగారం ధరతో 100 రూపాయలు పెరిగింది. 
 
ఇకపోతే, 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5923గా ఉంటే 8 గ్రాముల బంగారం ధర రూ.47384గాను, 10 గ్రాముల బంగారం ధర రూ.59230గా ఉంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100కు పెరిగింది. 
 
వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర రూ.76.70గాను 8 గ్రాముల వెండి ధర రూ.613.60గా, 10 గ్రాముల వెండి ధర రూ.767గా ఉంది. నిన్నటిధరతో పోల్చితే శుక్రవారం పది గ్రాముల బంగారం ధరలో ఎలాంటి తేడా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది.